ఫాస్ట్ ట్రాక్ చెక్ పోస్టు ప్రారంభం

ఫాస్ట్ ట్రాక్ చెక్ పోస్టు ప్రారంభం

ఇకనుండి వాహనాలకు చార్జీలు వసూలే


ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా (Adilabad district) ఉట్నూరు మండలంలోని కొత్తగూడలో ఏళ్ల తరబడి ఉన్న ఫారెస్ట్ పాత చెక్ పోస్టు తో పాటు ఆ చెక్ పోస్టు వద్దనే మరో నూతన ఫాస్ట్ ట్రాక్ చెక్ పోస్టు ను శుక్రవారం అటవీశాఖ అధికారులు ప్రారంభించారు. ఉట్నూర్ వైపు నుండి జన్నారం వెళ్లే అటవీ ప్రాంతంలో నడిచే వాహనాలకు అటవీశాఖ చార్జీలు వసూలు చేయడానికి నూతనంగా ఫాస్ట్ ట్రాక్ చెక్పోస్ట్ ను ప్రారంభించారు. నాలుగు చక్రాల కార్లు వాహనాలకు 50 రూపాయల ఫీజు, ఆరు చక్రాల వాహనాలకు 150 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు.

ఈ నూతన చెక్ పోస్ట్ లో ఒకేవైపు ఉట్నూరు నుండి జన్నారం (Jannaram) వెళ్లే వాహనాలకు మాత్రమే చార్జీలు తీసుకుంటున్నారు. ఇంజన్ పెళ్లి నుండి ఉట్నూరు వైపు వచ్చే వాహనాలకు చార్జీలు తీసుకోమని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎందుకంటే ఇంజన్ పెళ్లిలో చెక్పోస్ట్ ఉండడం వల్ల అటు నుండి ఉట్నూర్ వైపు వచ్చే వాహనాలకు ఇంధన్ పెళ్లి చెక్పోస్టులో చార్జీలు తీసుకోవడంతో ఇక్కడ చార్జీలు తీసుకోవడం లేదని అటవీ శాఖ ఉద్యోగులు తెలిపారు.

ఎన్నో సంవత్సరాలుగా కొత్తగూడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉన్న ఆ చెక్ పోస్ట్ లో కేవలం వాహనాలు తనిఖీ చేసి అక్రమ కల్ప తరలించకుండా తనిఖీలు చేసేవారు ఇప్పుడు మళ్ళీ అటవీశాఖ అధికారులు ఫాస్ట్ ట్రాక్ క్ చెక్పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలకు చార్జీలు వసూలు చేయడంతో నాలుగు ఆరు పై చక్రాల వాహనదారులు ఇదెక్కడి చార్జీలు వసూలు అని పేర్కొంటున్నారు. స్థానిక వాహనాలకు చెక్ పోస్ట్ చార్జీల వసూలు వినాయకుడు ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు.

Leave a Reply