సుదర్శన్ రెడ్డిని కలిసిన నూతన కౌన్సిలర్లు

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ ; భీంగల్ మున్సిపల్ రెండో విడుత సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు శనివారం బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ని హైదరాబాద్ లో కలిశారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని నూతన కౌన్సిలర్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

విజయం సాధించిన కౌన్సిలర్ లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ని నమ్మి విజయం అందించిన భీంగల్ పట్టణ ప్రజలకు పీసీసీ ధన్యవాదములు తెలిపారు. పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఈ సందర్బంగా సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నూతన కౌన్సిలర్లు సంటి లత, ఆరెపల్లి శ్రీజ, పర్శ కుశలత, తోట సతీష్, బోదిరే నాగమణి, అంజుమ్ అలీ, సందీప్, సంగ్యా నాయక్ లతో పాటు పార్టీ మండల అధ్యక్షులు బోదిరే స్వామి, పట్టణ అధ్యక్షుడు నర్సయ్య, కమ్మర్ పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, వెల్డింగ్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Leave a Reply