యూరియా పంపిణీలో నిర్లక్ష్యం
ఆదిలాబాద్ ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూరియా లారీలు పక్కదారి పట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఇందుకు సంబంధించి కొమురం భీమ్ జిల్లా వ్యవసాయాధికారి ఆర్.శ్రీనివాస రావును సస్పెండ్ చేస్తూ ఈ రోజు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు.
కొమరం భీం జిల్లాలో నిన్న పంపిణీ చేయాల్సిన రెండు లారీల యూరియా(Two lorries of urea) పక్కదారి పట్టడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో విధుల్లో నిర్లక్ష్యం, యూరియా పంపిణీ లో పర్యవేక్షణ లోపం గుర్తించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ గా స్పందించి జిల్లా కలెక్టర్‌తో(with the District Collector) మాట్లాడారు.
కొమురం భీం(Komuram Bhim) జిల్లాలో ప్రతిరోజూ రైతులు(farmers) యూరియా కోసం నానా తంటా లు పడుతుంటే వ్యవసాయ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది.
యూరియా పంపిణీ పర్యవేక్షణలో, సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారని, విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యంతో పాటు కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించారనే అభియోగం పై కొమురం భీం జిల్లా వ్యవసాయాధికారి ఆర్.శ్రీనివాస్ రావును సస్పెండ్(R. Srinivas Rao suspended) చేశారు.
ఈ మేరకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి(Agriculture Director Gopi) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారిగా సిర్పూర్ (యు) ఏడీఏ వెంకటిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అదే సమయంలో ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా జిల్లా కేంద్రం విడిచివెళ్లవద్దని ఆర్. శ్రీనివాస్‌ను ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

