ఎయిడ్స్ ప‌ట్ల అప్రమత్తత అవసరం..

  • క‌లెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : హెచ్ఐవి, ఎయిడ్స్ ప‌ట్ల విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని జిల్లా క‌లెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సంద‌ర్భంగా భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద అవ‌గాహ‌నా ర్యాలీని సోమ‌వారం జిల్లా క‌లెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ప్రకాశం చౌక్ వ‌ర‌కు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సంద‌ర్భంగా జిలా క‌లెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ ప‌ట్ల అప్రమ‌త్తంగా ఉండేందుకు నిరంత‌రం అవ‌గాహ‌నా కార్య‌క్రమాల‌ను నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఎయిడ్స్ బారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై కూడా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. జిల్లాలో సుమారు 1,500 మంది ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు. కొత్తగా వ్యాధి సోకకుండా గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించాలన్నారు. కుటుంబంలో ఎయిడ్స్ సోకిన వ్యక్తికి పుట్టబోయే పిల్లలకు వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా మందులను వాడాలని, చికిత్సకు సహకరించాలని కోరారు. ఎయిడ్స్‌, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల‌పట్ల వివ‌క్షత చూపించ‌కూడ‌ద‌ని, వారు కూడా స‌మాజంలో భాగ‌మేన‌ని అన్నారు. దీనికోస‌మే ప్ర‌తీఏటా డిసెంబ‌రు 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్వో డాక్టర్ రవిబాబు, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, హాస్పిటల్ పర్యవేక్షకులు లక్ష్మణ్ జీతనాంద్, ఏ ఆర్ టి సెంటర్ కౌన్సిలర్ నాగరాజు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ గోవిందబాబు, డాక్టర్ అయ్యగారి శ్రీరామ్, ప్రవీణ్, మాధవి లత శివరంజని, శ్రీనివాస్, రాంబాబు పార్మాసిస్ట్ విష్ణు, ఎన్సిసి అధికారి మేజర్ కే.వీరయ్య, గోపిశెట్టి మురళీకృష్ణ, ఎఆర్టి సెంటర్ సిబ్బంది, డిఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది, రోటరీ, లైన్స్, రెడ్ క్రాస్, తదితర స్వచ్చంద సంస్థలు, నర్సింగ్ స్టూడెంట్స్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply