Breaking news |కూలిన భారత్ తేజస్ యుద్ధ విమానం
Breaking news | దుబాయ్ : దుబాయ్‌లో జరుగుతున్న ఎయిర్ షో (Dubai Air Show) లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రదర్శనలో పాల్గొంటున్న భారత వాయుసేనకు చెందిన తేజస్ యుద్ధవిమానం (Fighter Jet Crashes) శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా కుప్పకూలింది. విమానం నేలకు పడిన వెంటనే భారీగా మంటలు చెలరేగి, అక్కడ ఉన్న వారిలో భయాందోళన నెలకొంది.
ఈ ప్రమాదంలో పైలట్ పరిస్థితి ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ప్రమాద తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే అతను ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు స్థానిక వర్గాలు భావిస్తున్నాయి. ఘటన జరిగిన క్షణాల దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉంది.

