Ndc Delegation : అమరావతి అభివృద్ధిపై ఎన్డీసీ ఫోకస్ Andhra Prabha News

Ndc Delegation : అమరావతి అభివృద్ధిపై ఎన్డీసీ ఫోకస్ Andhra Prabha News

  • సచివాలయంలో కీలక భేటీ
  • ఏపీ అభివృద్ధి మోడల్‌పై జాతీయ స్థాయిలో అధ్యయనం
  • విశాఖ, అమరావతి పరిశీలనకు డిఫెన్స్ కాలేజ్ బృందం
  • ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం.. సీఎస్ క్లారిటీ
  • గతి శక్తి ప్రాజెక్టుల్లో ఏపీ దూసుకెళ్తోంది

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​ నెట్​ వర్క్)​

Ndc Delegation : న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన ఎంవి పటేల్ (Patel)(అతి విశిష్ట సేవా మెడల్) నేతృత్వంలో 16 మంది ప్రతినిధుల బృందం మంగళవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి జి.సాయి ప్రసాద్ తో భేటీ అయింది.నేషనల్ డిఫెన్సు కళాశాల ప్రతినిధి బృందం ప్రతి యేటా తమ కోర్సు అధ్యయనంలో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి,ఇతర అంశాలను అధ్యయనం చేస్తుంది. ఈబృందం ఏపీలోని విశాఖపట్నం స్మార్ట్ సిటి అభివృద్ది, అమరావతి ప్రజా రాజధాని అభివృద్ధి తదితర ప్రాంతాలను నేరుగా సందర్శించి అక్కడ జరిగే అభివృద్ధిని అధ్యయనం చేయనుంది. ఈపర్యటనలో భాగంగా ఎన్డీసీ బృందం సీఎస్ తో భేటీ అయి అమరావతి నూతన రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్ళను ప్రభుత్వం అధిగమిస్తూ నిర్మాణ పనులను ఏవిధంగా ముందుకు తీసుకువెళుతున్నదీ సిఎ స్ ను అడిగి తెల్సుకున్నారు.

Ndc Delegation : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోనే ఒక ఉత్తమ ఆధునిక రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ శర వేగంగా ప్రజా రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళుతోందని ఎప్డీసీ బృందానికి వివరించారు. రాష్ట్ర విభజనతో ఎదురవుతన్న అనేక ఆర్ధిక ఇబ్బందులను అధికమిస్తూ రాష్ట్రానికి ఒక బృహత్తర రాజధాని ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు సమీకరించి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన నూతన రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు.రహదార్లు,ఇతర మౌలిక సదుపాయాలన్నిటినీ శరవేగంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని సిఎస్ వివరించారు.

Ndc Delegation : కేవలం రాజధాని నిర్మాణమే కాకుండా రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాల్లో తగిన అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కర్నూల్, కడపల్లో విమానాశ్రయాలు ఉండగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఏపీ జనాభా కంటే సుమారు రెట్టింపు స్థాయి జనాభా కలిగిన మహారాష్ట్రతో సమానంగా ఏపీలో విమానాశ్రాయలు ఉన్నాయని పేర్కొన్నారు.అదే విధంగా ప్రస్తుతం ఉన్న ఓడ రేవులకు అదనంగా మరికొన్ని ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. పీఎం గతి శక్తి పథకంలో వివిధ జాతీయ రహదార్ల విస్తరణ, కొత్త రహదార్ల నిర్మాణం, పలు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయల విసర్తణలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు సాగుతోందని సీఎస్ సాయి ప్రసాద్ వివరించారు.

Ndc Delegation అంతకు ముందుకు ఎన్డీసీ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన ఎంవి పటేల్ (Patel)(అతి విశిష్ట సేవా మెడల్) మాట్లాడుతూ తమ ప్రతినిధి బృందం కోర్సు అధ్యయనంలో వివిధ రాష్ట్రాల్లో అనేక అంశాలను అధ్యయనం చేస్తున్నామని, దానిలో భాగంగానే ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు.ఎన్డీసీ ప్రతి యేటా 47 వారాల జాతీయ భద్రత, వ్యూహాత్మక అధ్యయన కోర్సును నిర్వహిస్తోందని ఇది ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో ప్రారంభమై డిసెంబర్ మొదటి వారంలో ముగుస్తుందని వివరించారు.ఈ కోర్సులో భాగంగానే వివిధ రాష్ట్రాలను విదేశాలను సందర్శించడానికి విస్తృతంగా పర్యటిస్తామన్నారు. ఇక్కడ కోర్సు సభ్యులు రాష్ట్ర అధిపతులను ముఖ్యమైన నిర్ణయాధికారులను కలుసుకుని ఆ రాష్ట్రం, దేశం రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక పరిస్థితులను అర్థం చేసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా ఆర్థిక భద్రత,శాస్త్ర సాంకేతిక రంగాలపై అధ్యయనం, ప్రపంచ సమస్యలు, అంతర్జాతీయ భద్రతా వాతావరణం, భారతదేశ వ్యూహాత్మక పొరుగు ప్రాంతం, జాతీయ భద్రత కోసం వ్యూహాలు నిర్మాణాలు తదితర అంశాలను అధ్యయనం చేస్తామని పాటిల్ వివరించారు.ఈ సమావేశంలో బ్రిగేడియర్లు ఇంతియాజ్ అహ్మద్ ఖాన్, కృష్ణకాంత్ శర్మ, రోహిత్ చలపతి, బినేష్ కుమార్ పాండా, రవీంద్ర సింగ్ చేమ, బ్రిగేడియర్ జనరల్ సెబ్సడే దూబా యున్టిసో(Sebside Duba Untiso) కమాండర్ జతిన్ సింగ్, ఎయిర్ కమాండర్ అలెగ్జాండర్ మాధ్యూ, కల్నల్, అజయ్ గురుంగ్, కీనెత్ ఆర్ హెర్రింగ్ డైన్ (Keeneth R Herringdine) ప్రియం వదా శర్మ, డిఐడి అరుణ్ సింగ్, రాజశేఖర్ ఎన్, లెప్టినెంట్ కల్నల్ జమ్ షిద్ ఖలిలోవ్ (Jamshid Khalilov) పాల్డొన్నారు.

Leave a Reply