సినీ పరిశ్రమలో ఇటీవల విడాకుల వార్తలు ఎక్కువవుతున్న నేపథ్యంలో, అనేక సెలెబ్రిటీ జంటలపై వదంతులు పుట్టుకొస్తున్నాయి. ఆ రకమైన గాసిప్ నయనతార-విఘ్నేష్ శివన్ జంటను కూడా వదిలిపెట్టలేదు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, వారు త్వరలో విడాకులు తీసుకుంటారనే ఊహాగానాలు కొన్ని సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి.
విడాకుల పుకార్లపై నయనతార స్పందించింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా విడాకుల గాసిప్‌లను చమత్కారంగా ఖండించింది. తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి.. సంతోషంగా నవ్వుతున్న ఫోటోను ఆమె షేర్ చేసింది. “మా గురించి ఇలాంటి పిచ్చి వార్తలు చూసినప్పుడు మా స్పందన ఇలాగే ఉంటుంది!” అని ఆమె కాప్షన్ కూడా రాసింది.
దీంతో వారి విడాకుల పుకార్లు వెంటనే కూలిపోయాయి. ‘కపుల్ గోల్‌స్’గా మారిన నయన్-విఘ్నేష్ జంట అభిమానుల హృదయాల్లో మరింత చోటు సంపాదించుకుంది. ఈ వార్తలపై నయన్ క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
