పేదింటి ఆడబిడ్డ పెండ్లికి నవ యువ శివ యూత్ సహాయం

కడెం( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన పేదింటి ఆడబిడ్డ పెండ్లికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఉడుంపూర్ గ్రామానికి చెందిన నవ యువ శివ యూత్ సభ్యుల, గ్రామ ప్రజల, మిత్రుల, శ్రేయోబిలాసిల నుంచి విరాళాలు సేకరించి మొత్తం రూ. 25 వేల 997 లు జమ చేసి ఆ కుటుంబానికి అందజేశారు. అలాగే యూత్ అధ్యక్షుడు కాశవేణి తిరుపతి యాదవ్ తన వంతు సహాయంగా రూ. 6 వేల 500 విలువ గల పెండ్లి బొల్లు విరాళంగా అందజేశారు.

ఈ సహాయం ద్వారా ఆ కుటుంబానికి కొంత ఆర్థిక భరోసా కలిగింది. అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే విధంగా మరిన్ని కార్యక్రమాలు గ్రామ యువత, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ప్రతి కార్యక్రమంలో ముందుకు రావాలని నిరుపేద కుటుంబాలకు మనకు తోచిన విధంగా అందుకుంటూ ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. సహాయం చేసిన వారందరికీ పేరుపేరున ఆడబిడ్డ మరియు తండ్రి ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply