National voter | ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

National voter | ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
National voter | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ సతీష్ కుమార్ ఆద్వర్యంలో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు.
భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతీ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం అంటూ అందరిచేత ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఎలక్షన్ డిటి సహదేవ్, డిటి పుష్పలత, ఎంఆర్ఐ రాములు, ఏఆర్ఐ భూపాల్ రెడ్డి, మక్తల్ మండల జీపీఓలు మక్తల్ పట్టణ వాసులు పాల్గొన్నారు.
