Library | జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

Library | భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చినఅమిరంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, పలు రకాల పుస్తకాల సేకరణతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వేగేశ్న అనురాధ ప్రారంభించారు. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు పాఠశాల గ్రంథాలయ రీడర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పుస్తక సేకరణ, పుస్తక ప్రదర్శన, పుస్తక సమీక్ష, వకృత్వ, వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ నిర్వాహకులు సీహెచ్.ప్రసాద రావు తెలిపారు. ఈ నెల 20న ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.తారకేశ్వరి, బి.రామకృష్ణ,పి. ప్రసాద్, డి.బాపిరాజు, టి అప్పన్న, జెఎస్వి. ప్రసాద్, బి.రాము, జి. నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply