కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఈడీ అధికారులు
నేషనల్ హెరాల్డ్ లో రెండు వేల కోట్ల మనీ లాండరింగ్
ఇప్పటికే యంగ్ ఇండియన్ ఆస్తులు సీజ్
ఈ కేసులో సోనియా, రాహుల్ లు నిందితులు
న్యూ ఢిల్లీ – నేషనల్ హెరాల్డ్ కేసు (National Herold ) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (sonia gandhi ) , రాహుల్ గాంధీ Rahul gandhi ) లను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో (raws avenue court ) ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని.. దాదాపు రూ.2 వేల కోట్ల మనీలాండరింగ్ జరిగిందంటూ ఈడీ అభియోగం మోపింది ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ సహా తదితరులపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అంతేకాదు.. యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్‌షీట్‌లో ఈడీ స్పష్టం చేసింది. దీని నుంచి రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా వారు పొందారని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే సోనియా, రాహుల్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా ఈడీ అధికారులు కోరారు.