Narsinghi | ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

Narsinghi | నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి మండల కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్ మాట్లాడుతూ… భారత రాజ్యాంగం మనకు అందించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, యువత దేశ సేవలో ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొని జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ నాగభూషణం,, వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply