Narsinghi | సెమీ క్రిస్మస్ వేడుకల్లో సర్పంచ్

Narsinghi | సెమీ క్రిస్మస్ వేడుకల్లో సర్పంచ్

  • తొలి కార్యాచరణకు శ్రీకారం

Narsinghi | నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : నార్సింగి మండలంలోని గ్రామంలో బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ రూబెన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఆకుల సుజాత మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి కార్యాచరణగా ఈ కార్యక్రమానికి హాజరై గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు

ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామంలో సమైక్యత, సౌహార్దం పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని, అన్ని వర్గాల ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఏసుక్రీస్తు సజీవమైన వాక్యంతో ఆధ్యాత్మిక వాతావరణంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, స్థానికులతో పాటు సమీప గ్రామాల విశ్వాసులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Reply