సీఎస్పీ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని అంబారిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీఎస్పీ (కస్టమర్ సర్వీస్ పాయింట్) కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెద్దూర్ శాఖ మేనేజర్ నరేష్, ఐఆర్‌ఐఎక్స్ ఛానల్ మేనేజర్ ఆకాష్ సూచించారు.

అంబారిపేట్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి వనజ–నరేందర్ దంపతులు ఈ సీఎస్పీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ నరేష్ మాట్లాడుతూ, బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడంతో పాటు చిన్నారుల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలని సూచించారు.

ఈ కేంద్రం ద్వారా బ్యాంకింగ్ సేవలను సులభంగా పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టి. రమేష్, ఉప సర్పంచ్ రెంకల విజయ్, జీపీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply