Narayanpet | లక్ష్య‌సాధన కోసం కృషి చేయాలి

Narayanpet | లక్ష్య‌సాధన కోసం కృషి చేయాలి

Narayanpet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రతి విద్యార్థి లక్ష్యాసాధన కోసం కృషి చేయాలని కలెక్టర్ సిక్తపట్నాయక్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు జిల్లా కేంద్రంలోని పరిమళపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్(Collector Sikta Patnaik) పాల్గొన్నారు.

భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “నేటి పిల్లలే రేపటి పౌరులు” అని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. చదువు సాధనకు మార్గం చూపుతుందని, బాలల దినోత్సవ వేడుకలలో భాగంగా పాఠశాలలో Young Orators Club (YOC) మిడ్-ఇయర్ షోకేస్ నిర్వహించారు.

ఇందులో Picture Talk, Show & Tell, Role Play వంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించిన కలెక్టర్ వారిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, Alokit Foundation బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply