Nara Chandrababu Naidu | శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు..

Nara Chandrababu Naidu | శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు..

Nara Chandrababu Naidu | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు
కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక దర్శనం
మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా దర్శనం
ఆలయ ఆచారాలు పూర్తి చేసిన ముఖ్యమంత్రి
టీటీడీ అధికారులు స్వాగతం, తీర్థప్రసాదాల అందజేత
వేదాశీర్వచనం పొందిన సీఎం చంద్రబాబు

Nara Chandrababu Naidu | తిరుమల,ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు మరియు మంత్రి లోకేష్ లతో కలిసి తన మనవడు చిరంజీవి నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా ముఖ్యమంత్రివర్యులు ఆలయంలోకి ప్రవేశించారు.

Nara Chandrababu Naidu

మహద్వారం వద్దకు చేరుకోగానే అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను, ఆలయ ప్రదక్షణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు.

Nara Chandrababu Naidu

శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రివర్యులకు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలు, శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్, ఈవోలు అందించారు.

Nara Chandrababu Naidu

ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా అధికారులు, టీటీడీ జేఈవోలు వీరబ్రహ్మం, డాక్టర్ శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply