Nara Chandrababu Naidu | పరిపాలన సౌలభ్యం కొరకు..

Nara Chandrababu Naidu | పరిపాలన సౌలభ్యం కొరకు..
- మూడు రెవెన్యూ డివిజన్లు కాదు నాలుగు..
- బనగానపల్లి కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు..
- ఇక నుంచి మండలాలు 30..
- జిల్లా కలెక్టర్ గజిట్ విడుదల..
Nara Chandrababu Naidu | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మేరకు 26 జిల్లాల నుంచి 28 జిల్లాలుగా మార్పు చెందాయి. ఇందులో నంద్యాల జిల్లా కూడా సమగ్ర స్వరూపం మారనుంది. గతంలో నంద్యాల జిల్లాలో 28 మండలాలు ఉండేవి. మూడు రెవిన్యూ డివిజన్లో ఉండేవి. నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లాలో బనగానపల్లెలో కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశారు. బనగానపల్లెను కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి (Rajakumari) గణియా గెజిట్ విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కొత్త రెవెన్యూ డివిజన్‌కు డోన్ ఆర్డిఓ నరసింహులుని బనగానపల్లి ఇంఛార్జ్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా నియమించారు. కొత్త డివిజన్ కార్యకలాపాలు సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన ఇన్చార్జ్ సిబ్బందిని కూడా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Nara Chandrababu Naidu | ఏపీ గవర్నమెంట్..
1974 ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు 7వ చట్టం సెక్షన్ 3ల్లోని ద్వారాలు లభించిన అధికారాలను పురస్కరించుకుని ఏపీ గవర్నమెంట్, సంబంధిత ప్రాంత అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాలో నూతనంగా బలంగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా 2022 వ సంవత్సరంలో ఆనాటి వైసీసీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నంద్యాల (Nandyala) జిల్లా ప్రత్యేక హోదానిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా గజట్ జారీ చేశారు. నంద్యాల జిల్లా సమగ్ర మూర్తి స్వరూపం మారనుంది. గతంలో 28 మండలాలుగా ఉండేవి. మూడు రెవిన్యూ డివిజన్లుగా ఉండేవి. ప్రస్తుతం 30 మండలాలకు నాలుగు రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లాలో ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్లో 10 మండలాలు ఉన్నాయి.

Nara Chandrababu Naidu | పరిపాలన సౌలభ్యం కొరకు..
అవి శ్రీశైలం ఆత్మకూరు వెలుగోడు నందికొట్కూరు పగిడ్యాల జూపాడుబంగ్లా కొత్తపల్లి పాములపాడు మిడుతూరు బండి ఆత్మకూరు మండలాలుగా ఉన్నాయి. నంద్యాల రెవెన్యూ డివిజన్లు 12 మండలాలు ఉన్నవి. అవి నంద్యాల రూరల్, నంద్యాల అర్బన్ గోస్పాడు సిరివెన్నెల జర్నీపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, అల్లగడ్డ పాణ్యం, గడివేముల మండలాలు ఉన్నాయి. డోన్ రెవెన్యూ డివిజన్ (Division) పరిధిలో డోన్ బేతంచెర్ల ప్యాపిలి మూడు మండలాలు మాత్రమే ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన బనగానిపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ఐదు మండలాలను ఏర్పాటు చేశారు. అవి సంజామల కొలిమిగుండ్ల బనగానపల్లె అవుకు కోయిలకుంట్ల మండలాలు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కొరకు ఏర్పడిన ఈ మండలాలు ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు.

Nara Chandrababu Naidu | తప్పిదాలను సరిచేయడం కోసం..
రాష్ట్రంలో ఒకప్పుడు బనగాని పెళ్లంటేనే ఫ్యాక్షన్ ప్రాంతంగా ఉండేది. నేడు ఉమ్మడి కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్ష్యంకు స్వస్తి చెప్పి అభివృద్ధి పథంలో పరిపాలనలో సమూల మార్పులు తీసుకువస్తుంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో బనగానిపల్లె రెవెన్యూ డివిజన్ నూతనంగా ఏర్పాటు అయింది. డివిజన్ ఏర్పాటులో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన మార్కును ముద్ర వేసుకున్నాడు. మంత్రుల పునర్విభజన కమిటీలో సభ్యుడైన బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీ పాలనలో పునర్విభజనలో చోటు చేసుకున్న తప్పిదాలను సరిచేయడం కోసం బనగానపల్లె రెవెన్యూ డివిజన్ గా ఉండాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వద్ద ఒప్పించి రెవెన్యూ (Revenue) డివిజన్ సాధించారు. ఉమ్మడి కుటుంబం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల సమయం గడిచిపోయింది. నంద్యాల జిల్లాను మంత్రి అభివృద్ధి పథంలో అయనించేందుకు కోట్లాది రూపాయల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. నూతన టెక్నాలజీతో రోడ్లను ఏర్పాటు చేశారు.
Nara Chandrababu Naidu | దగ్గరగా చేసే ప్రయత్నంలో భాగంగా..
బనగాని పల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడంతో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనపరంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారు. ప్రస్తుతం ధోన్ రెవెన్యూ డివిజన్లో ఉన్న బనగాని పల్లె కుంట్ల మండలాలు నంద్యాల న్యూ డివిజన్ పరిధిలో ఉన్న కొలిమిగుండ్ల సంజామల మండలాలను కలిపి బనగానపల్లె రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్ కు చాలా దూరంగా ఉన్న ప్రాంతాలను దగ్గరగా చేసే ప్రయత్నంలో భాగంగా అనగాని పల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సాధ్యమైంది. నంద్యాల జిల్లాలో ఉన్న 30 మండలాలలో డోన్, ప్యాపిలి మండలాలు జిల్లా హెడ్ క్వార్టర్ కు సుమారు 94 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి గతంలో ప్యాపిలి మండలాలను కర్నూలు (Karnool) జిల్లాలో కలిపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఇది అమలు కాకపోవటం ఆ ప్రాంత ప్రజలు కొంత నిరుత్సాహంగా ఉన్న మాట వాస్తవం. డోను కర్నూల్ కు 53 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. బనగాన పల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో నూతన భవనాలకు నిర్మాణం సాకారం.. ఇప్పటికే కొన్ని ప్రైవేటు భవనాలలో ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు మంత్రి సన్నాహాలు చేపట్టారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండే అన్ని కార్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లును చేస్తున్నారు. బనగానిపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల్లో మరింత ఉన్నత స్థానాన్ని సంపాదించిందని చెప్పవచ్చు.
