The Paradise సెట్ అడుగుపెట్టిన‌ నాని..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా కొనసాగుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన 40 రోజుల భారీ షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ జూన్ 21న మొదలవగా, నాని ఈరోజు (జూన్ 29, శనివారం) సెట్లో జాయిన్ అయ్యారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ‘ధగడ్ ఆగాయా’ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.

ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాని కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయి చిత్రంగా నిలవబోతుందన్న నమ్మకాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఈ చిత్రం వచ్చే సంవత్సరం 2026, మార్చి 26న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ వంటి 8కి పైగా భాషల్లో విడుదల కానుంది.

Leave a Reply