Nandyala | రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి

నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ … . నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు శనివారం రాత్రి 7 గంటలకు వెలుగోడు నుండి ఆత్మకూరు కు మోటార్ సైకిల్ పై వెళ్ళుచున్న సమయంలో స్మృతి వనం దగ్గర్లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో వెలుగోడు పట్టడానికి చెందిని సయ్యద్ సమీర్ (20 ) తో పాటు సనావుల్లా (20 ) ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. షేక్షా వలి తీవ్ర గాయాలతో విషమ స్థితిలో ఉన్నాడు

.

ఆత్మకూరు సిఐ రాము, ఆత్మకూరు ఎస్సై నారాయణరెడ్డి ,వెలుగోడు ఎస్సై సురేష్ సిబ్బందితో కలిసి వెలుగోడు ప్రభుత్వ వైద్యశాల చేరుకొని ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు విచారణ జరుగుతున్నట్లు ఆత్మకూర్ డిఎస్పి రామాంజనాయక్ తెలిపారు.

Leave a Reply