Nandyala | పేదల పెన్నిధి వైఎస్ జ‌గ‌న్

Nandyala | పేదల పెన్నిధి వైఎస్ జ‌గ‌న్

  • గత పాలన పేదలకు స్వర్ణ యుగం
  • మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి
  • ఘనంగా మాజీ సీఎం జన్మదిన వేడుకలు

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో పేదల పెన్నిధిగా మారాడని, పేదల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ మార్కెఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు జ‌గ‌న్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గంలోని కోస్పాడు మండలం పసులపాడు గ్రామంలో భారీ కేక్ కట్ చేశారు. గ్రామంలోని అన్నదాన కార్యక్రమం చేప‌ట్టారు.

Nandyala

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… లబ్ధిదారులకు ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా పథకాలను వారి ఖాతాలో జమ తీసిన ఘనత మాజీ సీఎం జ‌గ‌న్‌కి ద‌క్కింద‌న్నారు. పేదలకు వైద్యం అందించాలని మెడికల్ కళాశాలను ప్రారంభించారన్నారు. పీపీపీ విధానం వద్దని రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలని సేకర‌ణ‌కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌న్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, వైసీపీ గోస్పాడు మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ ప్రసాద్ యాదవ్, సర్పంచులు గడ్డం లలితమ్మ, పుల్లయ్య, వైసీపీ నాయకులు కాంతారెడ్డి చిన్న వెంకటసుబ్బారెడ్డి, భీమలింగేశ్వర రెడ్డి, త్రిలింగేశ్వర్ రెడ్డి, నాగరాజు, నాగేశ్వరావు పాల్గొన్నారు.

Leave a Reply