Nandyala | శ్రీశైలం టోల్గేట్ వద్ద పట్టుబడిన రూ. 30 లక్షల నగదు..

Nandyala | శ్రీశైలం టోల్గేట్ వద్ద పట్టుబడిన రూ. 30 లక్షల నగదు..
- పోలీసులకు అప్పగించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్…
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టోల్గేట్ ఆలయ పరిధిలో మంగళవారం పోలీసులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర కి చెందిన ఒక కారులో అనుమానాస్పదంగా పట్టుబడిన 30 లక్షలు నగదు పట్టుబడిన వైనంపై శ్రీశైలంలో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నగదు బంగారు వ్యాపారానికి సంబంధించినదిగా భక్తులు పోలీసులకు తెలిపారు. నగదు తరలింపు పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. నగదును శ్రీశైలం పోలీస్ స్టేషన్ కి అప్పగించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
