Nandyala | పోలీస్ కవాతు రిహార్సల్…

Nandyala | పోలీస్ కవాతు రిహార్సల్…

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల పట్టణ కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణనలో భాగంగా పోలీస్ కవాతును జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఈ రోజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ మంజునాథ్ పెరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తూ పోలీస్ కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. ముందుగా పెరేడ్ కమాండర్ జిల్లా ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. కవాతు పరిశీలన కొరకు ఆహ్వానించగా, ఎస్పీ పరేడ్ కవాతు పరిశీలన వాహనంలో పర్యటించి కవాతులో ఉన్న బలగాలను పరిశీలించి తిరిగి వేదిక వద్దకు చేరుకొన్నారు.

Nandyala

అనంతరం అతిధిలు ఇచ్చే ప్రసంగం ముగిసిన అనంతరం ద్వితీయ పరేడ్ కమాండర్ పరేడ్ మార్చింగ్ నిర్వహించారు. ఆద్యంతం సాగిన ఈ కవాతు రిహార్సల్స్ లో పోలీస్ అధికారులు, ఏ ఆర్ పోలీసులు, సివిల్ పోలీసులు, హోంగార్డ్స్ సిబ్బంది, ఎన్.సీ.సీ విధ్యార్థులు, స్కౌట్ విద్యార్థులు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శన కన్నుల పండుగగా నిర్వహించారు. సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలలో నిర్వహించు కవాతు ఇంకా అద్భుతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు తెలియజేశారు. అనంతరం పోలీసు జాగిలాలు “హాని, మార్షల్ “ గ్రౌండ్ నందు చేసిన విన్యాసాలు చూపరులను మంత్రముగ్దులను చేసింది.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిలు, పాఠశాల విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రటిష్టమైన భద్రతా చర్యలు తీసుకొని, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంగా చేసుకుంటూ, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి ఎం.జావళిరిజర్వు ఇన్స్పెక్టర్లు బాబు ,మంజునాథ్, సురేష్ బాబు ఆర్ ఎస్ ఐ లు ఉమామహేశ్వర రెడ్డి, మనోహర్ లు పాల్గొన్నారు.

Leave a Reply