Nandyala | నైతిక విలువలు అలవడతాయి…

Nandyala | నైతిక విలువలు అలవడతాయి…

  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా..

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : యోగి వేమన రచించిన పద్యాలు సమాజానికి నైతిక బోధనను అందించాయని, చిన్నతనం నుంచే వాటిని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం నైతిక విలువలు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. ఈ రోజు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో యోగి వేమన జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డీఆర్ఓ రాము నాయక్, డీఆర్ డీ ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డిలు పాల్గొన్నారు. యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. యోగి వేమన పద్యాలు సామాజిక సమానత్వం, మానవతా విలువలు, నిజాయితీ, కష్టపడి జీవించడం వంటి అంశాలను బలంగా ప్రతిపాదిస్తాయన్నారు.

Nandyala

మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వేమన పద్యాలు ఇప్పటికీ ప్రాధాన్యతను కోల్పోకుండా సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అధికారికంగా ఏడాది పొడవునా నిర్వహించాల్సిన జయంతి, వర్ధంతి వేడుకల జాబితాను ముందుగానే సిద్ధం చేసి జిల్లా అధికారులకు పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత నెలలో జరిగే జయంతి, వర్ధంతి కార్యక్రమాలపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా సమయపాలనతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply