Nandyala | బకాయిలు విడుదల..

Nandyala | బకాయిలు విడుదల..
- సంక్రాంతి వేళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల మోములో ఆనందం
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు కరువు బత్యం బకాయిలు 1100 కోట్ల రూపాయలు విడుదల చేయటం హర్షదాయకమని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కన్వీనర్ గిరిబోయిన నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఎస్టీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
సంక్రాంతి పండుగకు బకాయిలు విడుదలతో పాటు వారి ఖాతాలో కూడా నిధులు జమ్మయాయని పండుగ వీరందరూ ఆనందంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి 30 శాతం కరువు భత్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను ఈ ముఖ్యమంత్రి అవ్వడం అభినందనీయమన్నారు. జూలై 2018 నుంచి 2020 నవంబర్ 4వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 94 ద్వారా విడుదల చేశారన్నారు. 31.44 శశాతం 30 నెలల అరియర్స్ ను మూడు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వ ఉత్తర్వులు 94 లో పేర్కొన్నారు. ప్రస్తుతం కరువు భత్యం బకాయిలు విడుదల చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పెన్షనర్లకు మరియు మున్సిపల్ ఉద్యోగులకు ఆర్థిక లబ్ధి చేకూరనుందన్నారు.
దీని వల్ల ఉద్యోగులు, పెన్షనర్లలో ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్ బిల్లులు కూడా క్లియర్ చేయాలని కోరారు. అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల పిఆర్సి కమిషన్ ను వెంటనే నియమించాలన్నారు.ఈలోగా మధ్యంతర భృతి ప్రకటిస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లర్లు కు పిఆర్సి ప్రకటిస్తాన ని చెప్పిన హామీ మేరకు ప్రకటించి 30 శాతం కరువుభాత్యాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పాత కరువు బత్యం బకాయిల నిధులు విడుదల
ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో సంతోషాన్ని నింపిందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ఇలాంటి నిర్ణయాలు కొనసాగించాలని ఆయన కోరారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న పి ఆర్ సి కమిషన్ నియామకం మధ్యంతర భృతి చెల్లింపు ఇలాంటి సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం స్పందించాలన్నారు. కార్యక్రమంలో ఆఫీస్ కార్యాలయము ఇన్చార్జి లగి శెట్టి సుబ్బయ్య, పెన్షనర్లు తిరుపతయ్య, ఖాజా హుస్సేన్, శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
