Nandikotkur | అక్రమ కట్టడాలపై కొరడా

Nandikotkur | అక్రమ కట్టడాలపై కొరడా

  • అనుమ‌తుల్లేకుండా నిర్మాణాలు చేప‌ట్టొద్దు
  • నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ జి.వెంకటరామిరెడ్డి
  • టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు

Nandikotkur | నందికొట్కూరు, ఆంధ్రప్రభ : అనుమతులు లేని లేఅవుట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని, అలాగే అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ జి.వెంకటరామిరెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అనుమతులు లేని లేఅవుట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని, అలాగే అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

శనివారం నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలో నంద్యాల రోడ్డులోని అక్రమంగా వేసిన వెంచర్లలో నిర్మాణం చేపట్టుతున్న గృహాలను పరిశీలించారు. వెంచర్లకు సంబంధిత అనుమతి పత్రాలు ఉన్నాయా, లేదా అని టౌన్ ప్లానింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా ప్రతి అధికారి పనిచేయాలని నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం నిబంధనలను క‌చ్చితంగా పాటించాలని, లేఅవుట్‌ అనుమతులు లేకుండా నిర్మించే వెంచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతులు పొందిన వెంచర్లు మున్సిపాలిటీకి కేటాయించిన గ్రీన్‌బెల్ట్‌ స్థలాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. సదరు స్థలాలకు ఫెన్సింగ్‌, కాంపౌండ్‌వాల్‌ నిర్మించి నర్సరీలు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు.

మున్సిపాలిటీలో ప్లాట్లుగా వేయాలంటే ముందుగా పొలానికి రెవెన్యూ ల్యాండ్ కన్వర్షన్ ధ్రువీకరణ పత్రం పొందాలి. ఇందుకు ఐదు శాతం మార్కెట్ విలువ చెల్లించాలి. జీవో 275ను అనుసరిస్తూ పది శాతం ఓపెన్ స్థలం, 2 శాతం ఎమినిటిస్, 2 శాతం యుటిలిటీ ఛార్జీలు చెల్లించాలి. 40 అడుగుల రహదారులు ఏర్పాటు చేయాలి. ఎకరాకు రూ.5-6 లక్షల రుసుము చెల్లించి సరైన పత్రాలతో మున్సిపాలిటీకి అంతర్జాలం ద్వారా దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత అర్బన్ డీటీసీపీకి వెళ్తుంది అని అన్నారు. అక్కడి నుంచి టీఎల్పీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. రెండేళ్ల లోపు రహదారులు, కాలువలు, నీటి గొట్టాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అని తెలిపారు. ఓపెన్ స్థలాన్ని పురపాలక సంఘానికి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి రంగస్వామి సచివాలయం సిబ్బంది టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply