Nandigama | కారు ఢీకొని మహిళ మృతి

Nandigama | కారు ఢీకొని మహిళ మృతి
- మేకగూడ చౌరస్తాలో ఘటన
Nandigama | నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ మండల పరిధిలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీకొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం.. మేకగూడ గ్రామానికి చెందిన కొంకణి సుమిత్ర (30) ( భర్త లేట్ జంగారెడ్డి) తన స్కూటీపై జహంగీర్ పీర్ దర్గా రోడ్డు మీదుగా వెళ్తుండగా మేకగూడ చౌరస్తాలోని బెల్లం చాయ్ టీ పాయింట్ సమీపంలోకి రాగానే, అటుగా వచ్చిన కారు ఆమె వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సుమిత్రకు తీవ్రగాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిది. సమాచారం అందుకున్న నందిగామ పోలీస్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
