Nalgonda | రంగనాయకస్వామిల ఎదుర్కోళ్ల మహోత్సవం

Nalgonda | రంగనాయకస్వామిల ఎదుర్కోళ్ల మహోత్సవం

Nalgonda | నల్లగొండ ,ఆంధ్ర ప్రభ : ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా మంగళవారం రాత్రి నల్లగొండ పట్టణంలోని పలు దేవాలయాల్లో తోపాటు రామగిరిలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో గోదాదేవి,రంగనాయకస్వామిల ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి చైతన్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చక స్వాములు సాంప్రదాయబద్ధంగా,శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి వేర్వేరుగా వాహనాలపై ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రజలు,భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిశ్చితార్థం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Nalgonda

శ్రీ త్రిదండి రామచంద్రరామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో గోదాదేవి రంగనాథస్వామి వ్రత పూజను 30 రోజుల పాటు భక్తులకు వివరించారు. స్వామి,అమ్మవార్లను వేర్వేరుగా,ఎదురెదురుగా ఆసీనులను చేసి అర్చకస్వాములు స్వామి వారి గురించి వివరించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, చైతన్య,ఈవో జయరామయ్య,చకిలం వేణుగోపాల్రావు,సంధ్యారాణి, వంగాల అనిల్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply