వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెదిరె మేఘా రెడ్డి

వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెదిరె మేఘా రెడ్డి
మునుగోడు, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం నుండి నూతనంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి ఈరోజు హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
