Nagoba | నాగోబాను దర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

Nagoba | నాగోబాను దర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
Nagoba | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో వెలసిన మెస్రం వంశీయుల ఆరాధ్య దైవమైన శ్రీ నాగోబా దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కుస్రం నీలాదేవి, కమీషన్ సభ్యులు.
రేణికుంట్ల ప్రవీణ్ రాంబాబు నాయక్, గాకొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్ ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించి నాగదేవత చిత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… నాగోబా జాతర సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని కోరుకున్నట్టు తెలియజేసారు.


