Nagayalanka | వైభవంగా కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

Nagayalanka | వైభవంగా కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

Nagayalanka | నాగాయలంక, ఆంధ్రప్రభ : స్థానికంగా వేంచేసి వున్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ సమన్విత పార్వతీ సమేత నగరేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మ వారి ఆత్మార్పణ దినోత్సవం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా 102 బిందెల కృష్ణమ్మ జలాలను భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి,102కిలోల బియ్యంతో అభిషేకాలను ఆలయ అర్చకులు కొల్లిపర సుబ్బారావు బ్రహ్మత్వంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయగా ఆలయ కమిటీ ఛైర్మన్ చిట్టా సాంబశివరావు,శివ నాగేశ్వరరావు,వీర అన్నపూర్ణయ్య, శేఖర్,
పర్యవేక్షించారు.

Leave a Reply