• 3,58,306 క్యూసెక్కుల విడుద‌ల‌
  • సాగ‌ర్‌కు 4.48 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద‌


ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ బ్యూరో : నాగార్జున సాగర్ (NagarjunaSagar) ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 4,48,920 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో గా వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 26 గేట్లను ఎత్తి 3,58,306 క్యూసెక్కుల నీటినీ దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో (In flow) గా వస్తుండగా 4,08,851 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.10 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీ లు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 294.8385 టీఎంసీలకు చేరుకుంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి ( hydro power station) 29,679 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 3,60,100 క్యూసెక్కులు, ఏఎంఆర్‌పీ ద్వారా 2400 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ ద్వారా 300 క్యూసెక్కుల ల నీటిని విడుదల చేస్తున్నారు.

Leave a Reply