Nag 100th Movie | ఏం జరుగుతోంది..?

Nag 100th Movie | ఏం జరుగుతోంది..?

Nag 100th Movie | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : టాలీవుడ్ కింగ్ నాగార్జున.. నాటి విక్రం నుండి నేటి కూలీ వరకు నలభై ఏళ్ళ ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు.. ఎన్నెన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ అందించారు. అలాగే ప్లాపులు కూడా ఇచ్చారు. అయితే.. నాటి నుంచి నేటి వరకు సరికొత్త కథా చిత్రాలు శివలాంటి ట్రెండ్ సెట్ చేసిన ప్రయోగాత్మక చిత్రాలూ అందించి నేటికీ ట్రెండ్ సెట్టర్ గా నిలవడం విశేషం.

ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న నాగ్ 100వ సినిమా కోసం గత కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వచ్చిందని కూడా వార్తలు వినవచ్చాయి. కానీ.. ఆ మూవీ టీం(Movie Team) నుంచి మాత్రం అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అభిమానులందరిలోనూ ఒక్కటే ఉత్కంఠ…ఎప్పటికప్పుడు షూటింగ్ విషేషాలు, టెక్నికల్ స్పెషాలిటీస్ గురించి మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయాల్సిన ఈ మైలుస్టోన్ మూవీని నాగ్ ఎందుకు సైలెంట్ గా చేస్తున్నారు. అసలు ఎలా జరుగుతోందీ మూవీ ప్రొడక్షన్? నాగ్ 100వ సినిమా వెనుక ఏం జరుగుతోంది..?

నాగార్జున విక్రమ్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు. కొత్త దర్శకుడు రాం గోపాల్ వర్మ పై పూర్తి నమ్మకముంచి, అతడికి అవకాశమిచ్చి, శివ సినిమాతో తెలుగు సినిమా నడతనే మార్చేశారు. అలాగే ఆ తర్వాత కూడా ఎంతో మంది కొత్త దర్శకులును ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కేవలం డాన్సులూ, ఫైటింగులనే నమ్ముకోకుండా, కంటెంట్ ని నమ్మి, అంటే ఎప్పటికప్పుడు తనకి సరిపోయే మంచి కథలనెంచుకుని, అన్నివర్గాల ప్రేక్షకులనూ అలరిస్తూ వస్తున్నారు నాగార్జున.

అయితే.. నాగ్ ఎప్పుడో 100 సినిమాకి చేరుకున్నారు. ఈ మూవీ అందరికీ నచ్చేలా ఉండాలి అనే ఉద్దేశ్యంతో చాలామంది నుండి ఓపికగా చాలా కథలు విన్నారు. ఆఖరికి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ చెప్పిన కథకు ఓకే చెప్పారు. ఈ కథపై చాన్నాళ్లు కసరత్తు చేశారు. ఆఖరికి కార్తీక్ చెప్పిన కథ పూర్తి స్థాయిలో నచ్చడంతో ఈ సినిమాకి నాగ్ ఓకే చెప్పారు. ఇటీవల ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చారు.

Nag 100th Movie | సైలెంట్ గా ఎందుకు షూటింగ్

అంతా బాగానే ఉంది కానీ, సైలెంట్ గా ఎందుకు షూటింగ్ చేస్తున్నారు అనేది అందరిలో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది..ఇంత వరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఎందుకు ప్రకటించలేదు అంటే.. కొంత టాకీ పార్ట్ షూటింగ్ చూసుకున్నాకా.. ఔట్ పుట్ రిజల్ట్ బాగుంది అనిపిస్తే.. అప్పుడు పక్కా ప్రకటించవచ్చు అనే ఆలోచనలో ఉన్నారట. ఆల్ టైం రికార్డ్స్ సృష్టించిన శివ సినిమాను నాగ్ చొరవతో 4కేలో రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కూడా ప్రత్యేకంగా తన టైం, ఎఫర్ట్స్ కేటాయించి టెక్నికల్ గా పూర్తి కొత్తదనాన్ని తెచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. శివ సినిమాను థియేటర్స్ లో అప్పుడు చూడని వాళ్లు.. ఇప్పుడు చూసే అవకాశం కల్పించారు. పైగా మంచి క్వాలిటీతో శివను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం వల్ల, అప్పుడు ఈ సినిమాను ఎంజాయ్ చేసిన అప్పటి యూత్, ఇప్పుడు తమ పిల్లలతో కలిసి చూసే అవకాశం వచ్చింది.

ఈ శివ కొత్త వెర్షన్ నేటీ యూత్ కు బాగా నచ్చేసింది. పాత సినిమా అయినప్పటికీ.. కొత్తగా రిలీజ్ చేయడంతో జనాలు విపరీతంగా చూశారు. దాదాపు 10 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేయడం విశేషం. నాగార్జున మాత్రమే కాకుండా.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) కూడా ఈ మూవీని బాగా ప్రమోట్ చేశారు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో నాగ్ మరి కొన్ని సినిమాలను 4 కేలో రీ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అవి ఏవేవి అనేది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదట. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా శివ సినిమాను కొత్తగా విడుదల చేశారు.

Nag 100th Movie | నాగ్ తో నాటి “పండు”

Nag 100th Movie

మరి.. 100వ సినిమా అప్ డేట్ ఎప్పుడు ఇస్తారు అంటే.. కొత్త సంవత్సరంలో(Next Year) నాగ్ 100 సినిమా అప్ డేట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. నాగ్ ను ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట డైరెక్టర్ కార్తీక్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది పొలిటికల్ జోనర్ అని ప్రచారం జరుగుతుంది. అలాగే ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని తెలిసింది. నాగ్ కు జంటగా టబు నటిస్తుందని టాక్ వినిపించింది.

విభిన్న చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ రెండవ మూవీ ‘నిన్నేపెళ్ళాడతా’ లో నాగ్ సరసన నటించిన అందాలభామ టబు. అందులో టబుని పండూ అని ముద్దుపేరుతో నాగ్ ఆటపట్టించిన సీన్లు ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. వీరిద్దరూ నిన్నేపెళ్ళాడతా తర్వాత ఆవిడా..మా ఆవిడే లో కలిసి నటించారు. ఆ తర్వాత ఈ జంట కలిసి నటించలేదనే చెప్పాలి. ఇన్నేళ్ళ తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్ళీ కలిసి నటిస్తుండడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఏది ఏమైనా.. నాగ్ 100వ సినిమా గురించి కొత్త సంవత్సరంలో ఎప్పుడు ఇస్తారో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Nag 100th Movie

(Shiva Movie) శివ సినిమాతో తెలుగు సినిమా నడతనే మార్చేశారు. అలాగే ఆ తర్వాత కూడా ఎంతో మంది కొత్త దర్శకులును ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కేవలం డాన్సులూ, ఫైటింగులనే నమ్ముకోకుండా, కంటెంట్ ని నమ్మి, అంటే ఎప్పటికప్పుడు తనకి సరిపోయే మంచి కథలనెంచుకుని, అన్నివర్గాల ప్రేక్షకులనూ అలరిస్తూ వస్తున్నారు నాగార్జున.

Click Here To Read More

Click Here To Read పెద్ది వస్తుందా, వాయిదా పడుతుందా?

Leave a Reply