Nadendla | రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

  • రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla | ఊయ్యురు, ఆంధ్రప్రభ : గండిగుంట గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, కలెక్టర్ డీకే బాలాజీ ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేప‌ట్టాల‌ని సూచించారు. కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుందన్నారు. కృష్ణాజిల్లాలోని గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెండువేల శాతం ఎక్కువగా కొనుగోలు చేశామని.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరగని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు.

Leave a Reply