Mylavaram MLA | గొప్ప దార్శనికుడు.. ఎన్టీఆర్

Mylavaram MLA | గొప్ప దార్శనికుడు.. ఎన్టీఆర్
- రాజకీయాలకు సరికొత్త భాష్యం చెప్పిన మహనీయుడు
- మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్
Mylavaram MLA | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి రాజకీయాలకు సరికొత్త భాష్యం చెప్పిన గొప్ప దార్శనికుడు అన్న ఎన్టీఆర్ అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఆదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు తొలిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానేత అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించిన భగీరథుడు ఆయనేనని అన్నారు. పేదలకు పట్టెడన్నం అందించాలనే సంకల్పంతో కిలో రెండు రూపాయలకే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

అన్న ఎన్టీఆర్ ఆశయాలనే ఆదర్శంగా తీసుకుని నేటి సీఎం చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయాలతో పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుతో పేదల జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తోందని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి, పరిశ్రమల స్థాపనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
