అందరి కోసం పనిచేయడమే నా లక్ష్యం…

  • రెండేళ్లలో రూ. 2వేల కోట్లతో అభివృద్ధి
  • అభివృద్ధి, సంక్షేమం దిశగా పయనం
  • ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజా పాలన
  • ఆలేరును అభివృద్ధిలో అగ్రగామి తీర్చిదిద్దడమే ధ్యేయం
  • నీళ్ల ఐలయ్యగా, ఇళ్ల ఐలయ్యగా పేరు
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : అట్టడుగు స్థాయి నుండి అన్ని రకాల వ్యవస్థలను చూసి పెరిగిన తాను తనకు రాజకీయాలకు అతీతంగా అందరి కోసం పనిచేయడమే నా లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం ఆంధ్రప్రభ తో మాట్లాడుతూ… సేవా నిరతితో అందరివాడిగా ఉండిపోవాలన్న ధ్యేయంతో అభివృద్ధి, సంక్షేమ కృషిని కొనసాగిస్తున్నామని చెప్పారు.

సమ ప్రాధాన్యతతో సమగ్ర అభివృద్ధి జరపాలన్నది తన ఉద్దేశమని వివరించారు. పల్లె సీమల అభివృద్ధి ధ్యేయంగా గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, 6 గ్యారంటీలు, హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదని తెలిపారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలన్నదే తమ ముందున్న లక్ష్యమని ఆంధ్రప్రభ కు వివరించారు.

రూ. 2 వేల కోట్లతో అభివృద్ధి పనులు..

రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాపాలనలో ఆలేరు నియోజకవర్గం లోనే రూ. 2 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని బీర్ల ఐలయ్య వివరించారు. గ్రామ గ్రామాన అంతర్గత రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం, గంధమల్ల ప్రాజెక్టు ఏర్పాటు, సీసీ రోడ్లు, సాగు తాగు జలాల కోసం కృషి చేస్తున్నాను అని వివరించారు.. రేషన్ కార్డు లేని వారికి కేవలం ఆలేరు నియోజకవర్గం లోని 40 వేల మందికి కొత్త రేషన్ కార్డులు అందించామని చెప్పారు. 12 వేల మందికి సిఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ఆదుకున్నారు..

నీళ్ల ఐలయ్య గా, ఇళ్ల ఐలయ్య గా పేరు…

వ్యవసాయ రంగానికి సాగు జలాలను అందించాలనే లక్ష్యంతో తన సొంత నిధులను (రూ. కోట్లు) ఖర్చు చేసి చెరువులను నింపే కార్యక్రమాన్ని చేపట్టగా రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ల ఐలయ్యగా పేరు గడించారు. నియోజకవర్గంలో వందకు పైగా చెరువులలో నీటిని నింపి సాగునీటి సమస్యను తీర్చారు. నియోజకవర్గం లో 3700 ఇళ్లు మంజూరు చేయగా అవన్నీయు ప్రారంభం చేసి రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగవంతంగా పూర్తి చేయడంలో అగ్రగామిగా నిలబెట్టాడు. గ్రామంలో త్వరగా ఎవరు ఇల్లు నిర్మాణాన్ని పూర్తిచేస్తే ఆ దంపతులకు పట్టు వస్త్రాలు, మేకపొడేలను అందజేసి ఇళ్లు ప్రారంభోత్సవంలో పాల్గొని దంపతులకు సన్మానం చేస్తున్నారు. దీంతో ఇళ్ల ఐలయ్యగా రాష్ట్రవ్యాప్తంగా పేరు మార్మొగింది..

ప్రజా సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యం..

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది.. గత రెండు సంవత్సరాలుగా అలుపెరుగని ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు కొనసాగుతున్నాడు.. అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలన్న లక్ష్యంతో అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం.. ఆరు గ్యారంటీలు, హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం.. రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సన్నాలకు బోనస్, ఉచిత నాణ్యమైన విద్యుత్, అందజేస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, చేనేత రుణమాఫీ, మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పావలాకే రుణాలు, వ్యాపారస్తులకు ప్రోత్సాహం, ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నామని చెప్పారు.

Leave a Reply