(ఘంటసాల, ఆంధ్రప్రభ): భారతదేశంలో అన్ని మతాలు ఒక్కటే అనే భావనతో ప్రజలందరూ కలసి-మెలసి జీవిస్తారు. మత సామరస్యాన్ని చాటిచెబుతూ కృష్ణా జిల్లా (Krishna District) ఘంటసాల గ్రామంలో హిందువులు ఘనంగా జరిపే గణపతి నవరాత్రుల ప్రారంభం రోజు బుధవారం ముస్లిం దంపతులు (Muslim couple) పీటల మీద కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. ఘంటసాల గ్రామంలోని శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వరస్వామి దేవస్థానం సమీపంలో జలధీశ్వర గణేష్ ఉత్సవ కమిటీ (Jaladheeshwara Ganesh Utsav Committee) వారు ప్రత్యేకంగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు.
తొలి రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా పీటల మీద ఘంటసాల గ్రామానికి చెందిన ముస్లిం దంపతులు షేక్ బాషా (షామియానా )- షర్మిల (శ్రీదేవి) దంపతులు కూర్చుని ప్రత్యేక పూజలు (Special Pujas) చేశారు. అన్ని మతాల సారం ఐక్యమత్యమనే భావనను తెలియజేస్తూ వినాయక చవితి పండుగలో తాము పాల్గొని స్వామివారికి పూజ చేశామని బాషా దంపతులు తెలిపారు.
గణనాథుడిని శ్రీకాకుళం డీసీ చైర్మన్ (Srikakulam DC Chairman) అయినపూడి భాను ప్రకాష్, జడ్పీ మాజీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, గ్రామ ప్రముఖులు దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు చావలి కృష్ణకిషోర్ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు.

