Murmu | నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం

Murmu | నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం
నేషనల్ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రపతి
Murmu | హైదరాబాద్, ఆంధ్రప్రభ : నియామకాల విషయంలో సర్వీస్ కమిషన్లు నియామకాల విషయంలో వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) కొనియాడారు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్‌పర్సన్ల నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference)లో ఆమె మాట్లాడారు.
1950 తర్వాత యూపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందన్నారు. ఈ సంస్థల రూపకల్పనలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr. B. R. Ambedkar) కీలక పాత్ర పోషించారన్నారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారాలు అవసరమన్నారు. ఈ ప్రక్రియలో అత్యంత పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్‌పర్సన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
