Munugodu | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Munugodu | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Munugodu | మునుగోడు, ఆంధ్రప్రభ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ నేలపట్ల నరేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతానికి వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి పౌరుడు తన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. దేశ సమగ్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది,వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply