Munugode | గ్రామాభివృద్ధిలో పాలకవర్గం పాత్రే కీలకం

Munugode | గ్రామాభివృద్ధిలో పాలకవర్గం పాత్రే కీలకం
- నూతన సర్పంచ్ లు, ఉపసర్పంచులకు సన్మానం
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు
Munugode | మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ లు, పాలకవర్గాల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు అన్నారు. ఇవాళ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నూతన సర్పంచ్ లు, ఉపసర్పంచులు హాజరయ్యారు.
ఇందులో భాగంగా నూతనంగా ఎన్నికైన కొరటికల్ సర్పంచ్ అద్దంకి రామలింగయ్య, కోతులారం సర్పంచ్ జాల జంగయ్య యాదవ్, చొల్లేడు సర్పంచ్ కదిరె లింగస్వామి, కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్, చీకటిమామిడి సర్పంచ్ జీడిమడ్ల సైదులు, రావిగూడెం సర్పంచ్ వరకుప్పల భువనేశ్వరి విజయ్, కల్వలపల్లి సర్పంచ్ పగిడిమర్రి కవిత నరసింహ చారి, కొంపల్లి సర్పంచ్ జీడీమడ్ల నిర్మల దశరథ, కొంపల్లి ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి, కాశవారిగూడెం ఉపసర్పంచ్ షేక్ జాన్ పాషా, కోతులారం ఉపసర్పంచ్ గుల్లి శంకర్ లను శాలువాలతో సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…. రాజకీయాలకతీతంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలు, నాయకులు, యువజన సంఘాల నాయకులు అభివృద్ధి పనులకు సహకరించాలన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, అన్ని పార్టీల నాయకులు గ్రామాల అభివృద్ధికి కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
