Municpl మున్సిపల్ ఎన్నికల్లో 80.16 శాతం ఓట్ల పోలింగ్

Municpl మున్సిపల్ ఎన్నికల్లో 80.16 శాతం ఓట్ల పోలింగ్
పోలింగ్ కేంద్రాలలో వృద్ధుల కోసం వీల్ చైర్లు
ప్రాథమిక చికిత్స కేంద్రాలు
పోలింగ్ కేంద్రాల్లో మంచి నీటి వసతులు
పోలీసుల పటిష్ట బందోబస్తు
Municpl | పరకాల, ఆంధ్రప్రభ: మున్సిపల్ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పరకాల మున్సిపాలిటీలో 80.16 శాతం ఓట్లు పోలింగ్ అయ్యాయి. బుధవారం రోజు ఓట్ల పోలింగ్ సందర్భంగా పరకాల మున్సిపాలిటీ 22 వార్డుల్లో 44 పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు, ప్రాథమిక చికిత్స శిబిరాలు, వృద్ధులను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావడానికి వీల్ చైర్లు ఏర్పాటు చేశారు.
పోలీసుల ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పరకాల మున్సిపాలిటీలో 22 వార్డులకు సంబంధించి మొత్తం ఓట్లు 26812 ఉండగా, బుధవారం రోజు ఉదయం 7 గంటలకు మొదలైన ఓట్ల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు 21469 మంది ఓటర్లు ఓట్లు వేయగా 80.16% వరకు పోలింగ్ జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు. పోలింగ్ అనంతరం పోలీస్ బందోబస్తు వద్ద పోలింగ్ బాక్సులను పట్టణంలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి తరలించి స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు .
ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితత్వం ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపులో తెలియనుంది. మున్సిపల్ ఎన్నికలలో పరకాల మున్సిపాలిటీ అధికారుల తోపాటు సిబ్బంది సేవలు మరువలేనివి.
