Adilabad | మున్సిపల్ రోడ్డు కబ్జా.. జాగృతి జిల్లా కన్వీనర్ అరెస్ట్

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలోని శాంతినగర్ కాలనీలో మున్సిపల్ రోడ్డును కబ్జా చేసి ఫోర్జరీ పేపర్లతో స్థలాన్ని ఆక్రమించుకున్న తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ రంగినేని శ్రీనివాసరావు (Rangineni Srinivasa Rao) ను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు (arrest) చేశారు.

ఇటీవలే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి డబ్బులు తీసుకున్న కేసులో బెయిల్ పై ఉన్న శ్రీనివాస్ శాంతినగర్ (Shantinagar) లోని లిటిల్ స్టార్ హైస్కూల్ వెనుక భాగంలో రోడ్డును ఆక్రమించుకొని ఫోర్జరీ డాక్యుమెంట్లతో కన్వెన్షన్ డిడ్ తో చలామణి అవుతున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a Reply