Municipal elections | బీజేపీ అభ్యర్థిగా లావణ్య సురేందర్..

Municipal elections | బీజేపీ అభ్యర్థిగా లావణ్య సురేందర్..

Municipal elections, వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డు గాంధీ కాలనీ నుండి బీజేపీ తరఫున లావణ్య సురేందర్ పోటీ చేయనున్నారు. బీజేపీకి ఈ వార్డులో గట్టి పట్టు ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి రెండో స్థానంలో నిలువగా ఈ దఫా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కారణంగా బీజేపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు.

ఈసారి లావణ్య సురేందర్ ఎట్టి పరిస్థితిలో గెలవాలన్న ఆకాంక్షతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే గాంధీ కాలనీలోని పలువురు ప్రముఖులను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఈ సందర్భంగా లావణ్య సురేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు దేశభక్తి దేశ ప్రజల కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు.

Leave a Reply