Municipal Commissioner | ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

Municipal Commissioner | ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

  • ఓటర్లు ఏమైనా తప్పులు ఉన్నాయే పరిశీలించుకోవాలి:
  • మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

Municipal Commissioner | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పురపాలక సంఘ పరిధిలోని 34 వార్డులకు సంబంధించిన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను ఈ రోజు అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ జాబితాను రూపొందించి ప్రచురించినట్లు మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పౌరుల పరిశీలనార్థం ఈ ఓటర్ల జాబితాలను బెల్లంపల్లి పురపాలక కార్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.

ఓటర్లు తమ పేరు, తండ్రి/భర్త పేరు, ఫోటో, చిరునామా, లింగం వంటి వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించారు. అభ్యంతరాలకు అవకాశం: ఓటరు జాబితాలో ఏవైనా తప్పులున్నా లేదా మార్పులు చేర్పులు అవసరమైనా, పౌరులు తమ అభ్యంతరాలను నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం పురపాలక కార్యాలయంలో పనిదినాల్లో సమర్పించవచ్చని కమిషనర్ తెలిపారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, లోపరహితంగా ఉండేందుకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని, ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు.

Leave a Reply