Municipal Commissioner | ప్లాస్టిక్ ను నివారించకుంటే కఠిన చర్యలు

Municipal Commissioner | ప్లాస్టిక్ ను నివారించకుంటే కఠిన చర్యలు
- మున్సిపల్ కమిషనర్ ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్
Municipal Commissioner | మక్తల్, ఆంధ్రప్రభ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నివారించకుంటే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా విధులు స్వీకరించిన ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ మక్తల్ మున్సిపాలిటీలోని అన్ని విభాగాలపై ఇవాళ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో మున్సిపాలిటీలో జరుగుతున్న పరిపాలనా పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణ, ఆదాయ వసూలు, ప్రజా సమస్యల పరిష్కారం అంశాలతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ అనే ప్రధాన అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా ప్రకటనల అడ్వర్టైజ్మెంట్ పై విధించబడే ఫీజుల విషయంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, మున్సిపల్ ఏఈ నాగశివ, మున్సిపల్ మేనేజర్ తో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
