ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలతో మోత్కూర్ సుందరీకరణ

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలతో మోత్కూర్ సుందరీకరణ

  • మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న
  • 11వ వార్డులో ర్యాలీ.. వార్డ్ కార్యాలయం ప్రారంభం
  • కాలని వాసులు, అధికారులతో కలిసి ప్రజాప్రతినిధుల ప్రతిజ్ఞ

మోత్కూర్, ఆంధ్రప్రభ ; ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలతో మోత్కూర్ మున్సిపాలిటీ సుందరీకరణ జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య ,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న లు అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 11 వ వార్డ్ లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన సమావేశంలో కాలని వాసులు,అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ ,వైస్ చైర్మన్ లు స్థానిక కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న తో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన వార్డ్ కార్యాలయం ప్రారంభించారు. వార్డులోని పలు సమస్యల పై చర్చించి పారిశుద్ధ్య, నీటి సమస్య, దోమల బెడద,నూతన మోరీల ఏర్పాటు విషయం,క్ రోడ్డు ల నిర్మాణం, విధి లైట్ల ఏర్పాటు, కోతులను నివారించడానికి చేసే విధానం పై వార్డు ప్రజల కు వివరించారు.

అదే విధంగా పెండింగ్ పైల్స్ విషయం, ఇందిరమ్మ ఇండ్లు, రోడ్డు భద్రత కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు.ఈ కార్యక్రమంలో 9 వ వార్డ్ కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సతీష్, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్,పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అన్నెపు పద్మ, వార్డు ఆఫీసర్ సంధ్య, జూనియర్ అసిస్టెంట్ యాదయ్య, నరేందర్, ఆర్ పి ధనలక్ష్మి, వాటర్ లైన్మెన్ నాగరాజు,మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply