Municipal | చెర్ పర్సన్ పీఠంపై ఉత్కంఠ..

Municipal | చెర్ పర్సన్ పీఠంపై ఉత్కంఠ..
అభ్యర్థులు క్యాంప్ లో
మంత్రి చెన్నూరులో
Municipal | చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపల్ చెర్ పర్సన్ పీఠం పై అధికార కాంగ్రెస్ పార్టీ లో ఉత్కంఠ నెలకొని అభ్యర్థి ఎంపిక మంత్రి వివేక్ వెంకటస్వామికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎవరి ప్రమయం లేకుండా 11కౌన్సిలర్ స్థానాలు కైవసం చేసుకొని పాలకవర్గం ఏర్పాటు చేయాల్సిన సమయాన చేరపర్సన్ పదవి వర్గాలకు దారితీసి మంత్రి వివేక్ పై స్థానిక నాయకుల ఒత్తిడి పెరిగింది.గెలిచిన అభ్యర్థుల క్యాంప్ లో కాలక్షేపం చేస్తుంటే సోమవారం నూతనపాలకవర్గం ప్రమాణస్వీకారం ఉన్న దృశ్య మంత్రి సతీసమేతంగా మహా శివరాత్రి సందర్బంగా వేలాల, కత్తారశాల లో పూజలో పాల్గొన్న అనంతరం క్యాంప్ కార్యాలయంలో చేరపర్సన్ అభ్యర్థి నియామకం పై స్థానిక శ్రేణులతో అభిప్రాయా సేకరణ చేస్తున్నారు.
ఈ క్రమములో స్థానిక నాయకులు మా వర్గానికి అంటే మా వర్గానికి పదవి కట్టబెట్టాలని భీస్మించుకొని కూర్చునట్లు సమాచారం. చెర్మన్ పదవి 2వ వార్డు నుంచి విజయం సాధించిన పెద్దింటి పద్మ శ్రీనివాస్ కు పట్టం కట్టాలని ఒకవర్గం బడా నాయకుల ఒత్తిడి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కొరకు ప్రతిపక్ష పార్టీల తో పోటీ 9 వ వార్డునుంచి విజయం సాధించిన సుద్దపల్లి సునీత సుశీల్ కు అధికార బాధ్యతలు అప్పగిస్తే పాలన నిజాయితీగా సాగుతుందనే విశ్వాసం తో కొంతమంది కోరితున్నారు. తమకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని 12వ వార్డునుంచి గెలిచిన మైనార్టీ అభ్యర్థి అజ్మా వర్గీయలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
