Muncipal | ఇదేం నిర్ల‌క్ష్యం..!

Muncipal | ఇదేం నిర్ల‌క్ష్యం..!

నరసరావుపేటలో పారిశుధ్యంపై దారుణం
ప‌ట్టించుకోని మున్సిపల్ అధికారుల
ఎమ్మెల్యే వైఫల్యంపై విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
5వ వార్డులో ప‌ర్య‌ట‌న‌

Muncipal | నరసరావుపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని మున్సిపల్ పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉండటం.. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరినట్లు కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక ఐదో వార్డులోని క్రిస్టియన్ పాలెం, శివ సంజీవనీ కాలనీల్లో ఆదివారం గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా ఆయ‌న పర్యటించారు. అనంతరం

మాట్లాడుతూ వార్డులో గత ఆరు నెలలుగా మురుగు కాల్వ‌లు శుభ్రం చేయడం లేదని జనం చెబుతుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఇంతకన్నా నిర్లక్ష్యం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. క్రైస్తవులు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో క్రిస్మస్ పండగ సమీపిస్తున్నా పారిశుధ్య నిర్వహణ పై ఏమాత్రం అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.

Leave a Reply