మున్సిపల్ పీఠంపై నల్లెల్ల…?

మున్సిపల్ పీఠంపై నల్లెల్ల…?
మామ ఆశయ సాధన కోసం కోడలు ప్రయత్నం…
మంత్రి సీతక్కకు అత్యంత విశ్వసనీయ కుటుంబంగా గుర్తింపు….
2018 ఎన్నికల్లో సీతక్క గెలుపులో నల్లుల నాలేల కుమారన్న కీలక పాత్ర
“నల్లెల్లకే మున్సిపల్ పీఠం” అంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ
ఆంధ్రప్రభ ప్రతినిధి ములుగు : ములుగు మున్సిపాలిటీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఒక్కటే..! మున్సిపల్ పీఠం ఎవరి చేతికి దక్కబోతోందన్న ఉత్కంఠ నడుమ… జిల్లా వ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్న పేరు “నల్లెల్ల” స్వాతి భరత్ కుమార్.అధికారం ఎవరికి? అనే ప్రశ్నకు… కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక నేతలు, ప్రజల్లో ఒకే చర్చ నడుస్తోంది.“ఈసారి మున్సిపల్ పీఠం నల్లెల్లదే” అంటూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది.మంత్రి సీతక్క రాజకీయ ప్రయాణంలో నల్లెల్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయాల్లోనే కాదు… కీలక రాజకీయ సందర్భాల్లోనూ నల్లెల్ల కుటుంబం సీతక్కకు అండగా నిలిచిందన్న అభిప్రాయం బలంగా ఉంది.అందుకే… మంత్రి సీతక్కకు అత్యంత విశ్వసనీయ కుటుంబంగా నల్లెల్ల కుటుంబం గుర్తింపు పొందింది.ఈ విశ్వాస బంధమే ఇప్పుడు మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.
2018 ఎన్నికల్లో కుమారన్న కీలక పాత్ర..!
ప్రత్యేకంగా 2018 ఎన్నికల్లో సీతక్క గెలుపులో కుమారన్న పాత్రను కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. ప్రచారంలో సమన్వయం, ప్రజలతో అనుబంధం, కార్యకర్తల నెట్‌వర్క్… ఇలా అన్ని కోణాల్లోనూ కుమారన్న కీలకంగా వ్యవహరించారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.అందుకే నల్లెల్ల పేరు చెప్పగానే… కాంగ్రెస్ వర్గాల్లో ఒక రకమైన జోష్ పెరుగుతోంది.
మామ ఆశయం… కోడలి లక్ష్యం..!
ములుగు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ పీఠంపై రాజకీయంగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.మున్సిపల్ పీఠం దిశగా… మామ ఆశయ సాధన కోసం కోడలు ముందుకు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.“మామ కలలు కన్న అభివృద్ధి దిశను కొనసాగించడానికే” అన్న భావనతో కోడలు అడుగులు వేస్తున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.ఈ ప్రయత్నం వెనుక కుటుంబానికి ఉన్న ప్రజాదరణ,రాజకీయ అనుభవం కాంగ్రెస్‌లో ఉన్న బలం,మంత్రి సీతక్కతో ఉన్న విశ్వాస సంబంధం ఇవన్నీ కలిసి పెద్ద ప్లస్‌గా మారుతున్నట్లు సమాచారం.
జిల్లా వ్యాప్తంగా చర్చ..!
ములుగు పట్టణంలోనే కాదు… జిల్లాలోని అనేక మండలాల్లో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది.“నల్లెల్లకే మున్సిపల్ పీఠం” అన్న ప్రచారం బలంగా సాగుతోంది.ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఈ మాట… ఒక రకంగా నిర్ణయంలా మారిందని చెప్పొచ్చు.కాంగ్రెస్ పార్టీకి ములుగులో బలమైన నాయకత్వం అవసరమైన సమయంలో… నల్లెల్ల కుటుంబం మరోసారి తెరపైకి రావడం పార్టీకి అదనపు బలంగా మారుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికి… ములుగు మున్సిపల్ పీఠంపై నల్లెల్ల కుటుంబం పట్టు సాధిస్తుందా?మామ ఆశయాన్ని కోడలు నెరవేర్చుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.కానీ… ప్రస్తుతం మాత్రం జిల్లాలో నడుస్తున్న చర్చ ఒక్కటే “మున్సిపల్ పీఠం నల్లెల్లదే..!”
