Mudhole | ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం…

Mudhole | ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం…
- కరపత్రాలు ఆవిష్కరణ
Mudhole |ముధోల్, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ముధోల్ లోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ షబానా బేగం ఏజాజుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి పాఠశాలలో ప్రవేశాలకు ఆన్లైన్ ప్రక్రియలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికారం అందిస్తున్నారని తెలిపారు. పోషకులు సైతం తమ వంతు బాధ్యతగా తమ బాలికల ఉజ్వల భవిష్యత్తుకై మైనారిటీ గురుకులాల్లో చేర్పించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు చేరే విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మైనారిటీ గురుకులాల్లో చదివిన విద్యార్థినిలు ఉన్నత విద్యలో రాణించడం ఆనందం కలిగిస్తుంది అన్నారు. ప్రభుత్వం బాలికల విద్యకు ఎంతో ప్రాధాన్య తీస్తుందని తెలిపారు. విద్యతోపాటు క్రీడల్లో సైతం రాణించాలని ఆకాంక్షించారు. మైనారిటీ గురుకుల పాఠశాలలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
విద్యార్థినులకు మైనారిటీ గురుకుల పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను విజిలెన్స్ అధికారులు తాహెర్, నజీర్ వివరించారు. మైనారిటీ గురుకులాల్లో విద్యార్థినులకు కేజీ టు పీజీ విద్య అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్లో మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఎంబిబిఎస్ లో సీట్లు సాధించడం గర్వకారణము అన్నారు. విద్యార్థినులు మైనారిటీ గురుకులాల్లో చేరే విధంగా పోషకులను ప్రోత్సహించాలని ప్రజా ప్రతినిధులు, నాయకులను కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డి. జ్యోతి సర్పంచును శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆయేషా ఆఫ్రోజ్ ఖాన్, నాయకులు హఫీజ్ అబ్దుల్ ఖవి, షకీల్ ఖాన్, వార్డు సభ్యులు అబ్దుల్ ఖాలీక్, బషీర్ అహ్మద్, నాయకులు నజీర్, అజర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
