MPUPS | పాఠశాలలను సందర్శించిన ఎంఈఓ రాజు

MPUPS | పాఠశాలలను సందర్శించిన ఎంఈఓ రాజు
MPUPS | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని రంగంపల్లి ఎంపీపీఎస్, కాసిపేట్ ఎంపీయూపీఎస్(MPUPS) పాఠశాలను ఎం ఈ ఓ మంత్రి రాజు సందర్శించారు. పిల్లల ప్రగతిని (చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ పరిక్రియలు) పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తగు సలహాలు సూచనలను అందించారు.
ప్రతిరోజు ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ ఉదయం 9:45 నిమిషాల లోగా పూర్తి చేయవలసిందిగా, ప్రతినెలా నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీటింగ్ (పిటియం) డీటెయిల్స్ యాప్ లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. మధ్యాహ్న భోజనంను మెనూ ప్రకారం నిర్వహించాలన్నారు. మధ్యాహ్న భోజనానికి వాడే చింతపండు, నూనె, కూరగాయలు నాణ్యమైనవి వాడవల్సిందిగా మిడ్డేమిల్స్ ఏజెన్సీ వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హరి ప్రసాద్, షరీఫ్, సి ఆర్ పి ఉగ్గే రమేష్ పాల్గొన్నారు.
